నెల్లూరు: జిల్లా వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9వ తేదీన చేపట్టనున్న అన్నదాతల పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా రైతు అధ్యక్షులు శివుని నరసింహులు రెడ్డి తెలియజేశారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. రైతుల పక్షాన వైసీపీ పార్టీ ఎప్పుడు పోరాడుతుందని తెలియజేశారు. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించేంతవరకు పోరాడుతామన్నారు.