GNTR: జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరులో 59వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. సభలో రాష్ట్ర అక్షరాస్యత రేటు దేశంలోనే అట్టడుగున 36వ స్థానంలో ఉందని, సంపూర్ణ అక్షరాస్యత సాధనకై ప్రభుత్వంతో పాటు ప్రజా భాగస్వామ్యం తప్పనిసరని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు పాల్గొన్నారు.