SRD: విద్యార్థుల్లో క్రమశిక్షణ తప్పనిసరి అని కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి అన్నారు. సోమవారం సిర్గాపూర్ హైస్కూల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో వెలుగుందినప్పుడే పాఠశాల అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ఇందులో ఎంఈవో నాగారం శ్రీనివాస్ ఉన్నారు.