NDL: నందికొట్కూరు మండలం కోనేటమ్మ పల్లె గ్రామానికి చెందిన దేవదానం అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న నందికొట్కూరు ఎమ్మెల్యే గీత జయసూర్య సోమవారం ఆయన పార్తివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఎమ్మెల్యే వెంట గ్రామ సర్పంచ్ దామోదర్ రెడ్డి తదితరులు ఉన్నారు.