PDPL :పెద్దపల్లి స్థానిక సంస్థల తుది ఓటర్ జాబితాను సెప్టెంబర్ 10న విడుదల చేయనున్నట్లు కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 137 ఎంపీటీసీ, 13 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్లు పేర్కొన్నారు. 650 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.