E.G: రాజమండ్రి అర్బన్, రూరల్ పరిధిలో గత రెండు రోజుల నుంచి భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. సోమవారం ఎండ తీవ్రతకు నగర ప్రజలు విలవిలలాడుతున్నారు. మధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రహదారుల పై చిరు వ్యాపారాలు చేసేవారు, కూలీలు, వాహనదారులు ఎండ దెబ్బకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.