AP: లిక్కర్ కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ సిట్ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ACB కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను నిలిపివేయాలని, అలాగే మిగతా నిందితులకు బెయిల్ ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని సిట్ కోరింది. విచారణ జరిపిన హైకోర్టు, బెయిల్ పొందిన నిందితులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది.