AKP: నర్సీపట్నం గ్రంధాలయంలో గ్రంధాలయాధికారి దమయంతి ఆధ్వర్యంలో సోమవారం ప్రపంచ అక్షరాస్యత దినోత్సవాన్ని నిర్వహించారు. అక్షరం నేర్చుకోవడం వలన మనం మన సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లవచ్చని గ్రంధాలయాధికారి చెప్పారు. విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు పీ.ప్రభాకర్ అక్షరం అమ్మవంటిదని, అమ్మ ప్రపంచాన్ని పరిచయం చేస్తే అక్షరం సమాజాన్ని పరిచయం చేస్తుందని అన్నారు.