W.G: తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధి విషయాలపై చర్చించేందుకు ఢిల్లీలో కేంద్ర ఉక్కు, పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సోమవారం కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కృషి చేస్తామని మంత్రి చెప్పినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు.