TG: HMDA కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రీజినల్ రింగ్ రోడ్ (RRR) బాధితులు భారీ సంఖ్యలో HMDA కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. తాము RRR కోసం భూములు ఇవ్వమని, ప్రభుత్వం తక్కువ ధరకు భూములు లాక్కోవాలని చూస్తోందని ఆరోపించారు. భూములు కోల్పోకుండా కొత్త ఆలైన్మెంట్ కాకుండా పాత దాన్నే కొనసాగించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.