ప్రకాశం: యర్రగొండపాలెం నియోజకవర్గంలో రైతులకు అవసరమైన పరిమితిలో యూరియా నిల్వలు ఉన్నాయని వైసీపీ అసత్య ప్రచారాలను నమ్మొద్దని ఏఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు తెలిపారు. సోమవారం పలు రైతు సేవా కేంద్రాలను పరిశీలించారు. వైసీపీ నాయకులు అబద్దపు ప్రచారాలతో రైతులను ఆందోళన బాట పట్టించాలని చూస్తున్నారని, కూటమి ప్రభుత్వంలో రైతులు ధైర్యంగా సంతోషంగా ఉన్నారని తెలిపారు.