GNTR: గుంటూరు జిల్లాలోని ఇసుక రీచ్‌ల వివరాలను సమాచార హక్కు చట్టం ప్రకారం తెలియజేయడం లేదని సముద్రాల చిన కోటేశ్వరరావు ఆరోపించారు. సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో జిల్లా ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని ఖనిజ సంపదను దోచుకుంటున్నారని ఆయన అన్నారు. 2010 నుంచి ఇప్పటివరకు ఎన్ని గనులను టెండర్ ద్వారా మంజూరు చేశారో తెలపాలని కోరారు.