TPT: వెంకటగిరిలో పోలేరమ్మ అమ్మవారి జాతర ఘనంగా జరుగుతోంది. ఇందులో భాగంగా రోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. MLA కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ఇవాళ రాత్రి 7 గంటలకు భద్రాచలం కళాకారులతో కొమ్ము కొయ్య ప్రదర్శన ఉంటుంది. పోలేరమ్మ ఆర్చి సెంటర్ నుంచి కాశీపేట, పాత MRO ఆఫీస్ మీదగా తూర్పు వీధిలోని పాత బస్టాండ్ వరకు ఈ ప్రదర్శన నిర్వహిస్తారు.