అనేకమందిని అమెరికా నుంచి తిరిగి పంపేందుకు ట్రంప్ విస్తృత అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా హెచ్-1బీ, ఎఫ్-1 వీసాదారులు అనధికారిక ఉద్యోగం నుంచి ఆదాయం పొందినట్లు తెలిస్తే దేశం నుంచి బహిష్కరించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ డేటా నుంచి వలసదారుల వివరాలు తీసుకోనుంది.