శుభ్మన్ గిల్ రాబోయే పదేళ్ల పాటు టీమిండియాకు కీలక ఆటగాడిగా ఉంటాడని మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. గిల్ అన్ని ఫార్మాట్లలో కెప్టెన్గా ఉండగల సమర్థుడు అని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్తో సిరీస్లో గిల్ తన కెప్టెన్సీ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడని పేర్కొన్నాడు. అలాగే, T20ల్లో గిల్ను వైస్ కెప్టెన్ చేయడం ద్వారా సూర్యపై ఎలాంటి ఒత్తిడి ఉండదని చెప్పాడు.