E.G: పెరవలి మండలం సీతారామపురంలో ఇవాళ నూతన రేషన్ దుకాణాన్ని తహసీల్దార్ కె.నిరంజన్ ప్రారంభించారు. స్థానికుల సౌకర్యార్థం ఈ చౌక ధర దుకాణాన్ని ఏర్పాటు చేశామని, నెలలో రెండు రోజులు సరుకులు అందిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో సూరిబాబు, సీఎస్వోటీ సుధాకర్ రెడ్డి, కూటమి నేతలు, అజ్జరం సొసైటీ అధ్యక్షులు దేవ పవన్ కుమార్ పాల్గొన్నారు.