NZB: 3 ఏళ్ల చిన్నారికి శస్త్రచికిత్స లేకుండానే అరుదైన గుండె ప్రొసీజర్ నిర్వహించి, రంధ్రం మూసివేసి పాప ప్రాణాలను మెడికవర్ హాస్పిటల్స్ వైద్య నిపుణులు కాపాడారు. ఈ మేరకు సోమవారం నగరంలోని మెడికవర్ హాస్పిటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శస్త్ర చికిత్సకు సంబంధించిన వివరాలను వైద్యులు వెల్లడించారు.