TG: కవిత ఇటీవల హరీశ్ రావుపై సంచలన ఆరోపణలు చేసి.. పార్టీ నుంచి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘కవిత అంశంపై మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పార్టీలో అందరితో చర్చించి కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నారు. కవితపై స్పందించడానికి ఏమీ లేదు’ అని అన్నారు.