SRCL: ప్రజావాణిలో ప్రజల నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఆదేశించారు. జిల్లా సిరిసిల్ల సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. మొత్తం ఆర్జీలు దరఖాస్తులు 154 వచ్చాయని తెలిపారు.