AP: CPS ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్ర సచివాలయంలో పనిచేసే CPS ఉద్యోగులకు మొదటి విడత DA బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. త్వరలోనే మిగిలిన CPS ఉద్యోగులందరికీ బకాయిలు చెల్లిస్తామని తెలిపింది. మొత్తం ఆరు విడతలుగా ఈ సొమ్ము ఖాతాల్లో జమచేస్తామని పేర్కొంది. కాగా, ఈరోజు సచివాలయంలోని ఒక్కో ఉద్యోగి ఖాతాలో రూ. 40 వేల నుంచి రూ.70 వేల వరకు జమచేసింది.