SKLM: సంపూర్ణ అక్షరాస్యతతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. సింగుపురం జడ్పీహెచ్ స్కూల్లో సోమవారం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బడి ఈడు పిల్లలను బడిలోనే ఉంచాలని అన్నారు. నిరక్షరాస్యత వలన సమాజానికి ఎంతో చెడు ఏర్పడుతుందని చెప్పారు.