KMM: సంపూర్ణ చంద్రగ్రహణం ముగిసిన అనంతరం సోమవారం ఉదయం ఖమ్మం నగరంలోని వరదయ్య నగర్లో ఉన్న శ్రీ మైసమ్మ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాన్ని అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు శుద్ధి చేశారు. అనంతరం అమ్మవారికి అభిషేకాలు చేసి, పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. ఉదయం 11 గంటల నుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.