GNTR: పొన్నూరు మండలం గాయంవారిపాలెంలో సోమవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ ఉప సర్పంచ్ మున్నంగి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యి లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ భీమిరెడ్డి వెంకటరెడ్డి, సచివాలయ అధికారులు, కూటమి నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.