నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాపై గత వారం నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ తీరుపై జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. రాజధాని ఖాట్మండుతోపాటు 10 నగరాల్లో ధర్నాలు చేపట్టారు. Gen-Z పేరుతో అవినీతి వ్యతిరేక ఉద్యమం చేపట్టారు. ఈ క్రమంలోనే నేపాల్ పార్లమెంట్లోకి ఆందోళనకారులు దూసుకెళ్లారు.