GNTR: తెనాలిలోని మున్సిపల్ హైస్కూళ్లలో రూ.21 లక్షల వ్యయంతో నిర్మించిన స్మార్ట్ టాయిలెట్లను మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం ప్రారంభించారు. వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ఆయా పాఠశాలల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి టాయిలెట్లను ప్రారంభించారు.