NLR: అనంతసాగరం గ్రామ పంచాయతీలో ఉండే స్థానిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ CPM పార్టీ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులుకు ఇవాళ వినతిపత్రం అందజేయడం జరిగింది. సీపీఎం నేత అన్వర్ బాషా మాట్లాడుతూ.. అనంతసాగరంలో పంచాయితీ నీళ్ళు ఎర్రగా వస్తున్నాయని, నీళ్ళులో బ్లీచింగ్ వేయాలని అన్నారు. శుభ్రమైన నీరు సరఫరా చేయాలన్నారు.