BDK: తెలంగాణ రాష్ట్ర సాధనలో తన ప్రాణాలు పణంగా పెట్టిన మహానుభావుడు బీ ఆర్ ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తోనే నా రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తానని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర రావు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తనపై కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దని స్పష్టం చేశారు.