TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి కక్ష కట్టారని మాజీ మంత్రి KTR విమర్శించారు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు అని అన్నారు. కమిషన్ పేరుతో రేవంత్ రెడ్డి టైంపాస్ చేశారని మండిపడ్డారు. గండిపేటకు రేవంత్ రెడ్డి తీసుకొచ్చే నీళ్లు.. కాళేశ్వరం నీళ్లు కాదా ? అని ప్రశ్నించారు. తక్షణమే ప్రజలకు రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.