KRNL: వైసీపీ నేతలు పురుగుల మందు డబ్బాలో మద్యం పోసుకొని తాగి హైడ్రామా సృష్టించారని ఎమ్మిగనూరు MLA జయనాగేశ్వర్ రెడ్డి సోమవారం విమర్శించారు. కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చేస్తుంటే ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ఉల్లికి మద్దతు ధర ఇస్తున్నా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యాయని పేర్కొన్నారు.