MBNR: బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ నాటకాలను మానుకోవాలని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ సాగర్ అన్నారు. ఈనెల 15వ తేదీన కామారెడ్డిలో బీసీల విజయోత్సవ సభ పేరుతో కొత్త నాటకాలకు కాంగ్రెస్ పార్టీ తెరలేపిందని వెల్లడించారు. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని మోసం చేశారన్నారు.