టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తుది జట్టులో ఆడే అర్హత ఉండి కూడా టీమ్‌లో అవకాశం దక్కకపోతే ఏ ఆటగాడైనా అసహనానికి గురవుతాడని అన్నాడు. ఇలాంటి సమయాల్లో వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభిప్రాయపడ్డాడు. కాగా, ఆసియా కప్ 2025 కోసం ఎంపిక చేసిన భారత జట్టులో శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే.