NLG: మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఖమ్మంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. నియోజకవర్గంలోని రైతుల అవసరాల మేరకు యూరియాను అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందించి రెండు, మూడు రోజుల్లో నియోజకవర్గానికి అవసరమైన యూరియాను అందించాలని అధికారులను ఫోన్లో ఆదేశించారు.