MBNR: ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. మండలాల వారిగా పరిష్కారం అయ్యే సమస్యలను అక్కడి పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పాల్గొన్నారు.