NLR: లైసెన్స్ ఉన్న ప్రతి ఆటో కార్మికులకు వాహన మిత్ర పథకం ద్వారా 25 వేల రూపాయలు ఇవ్వాలని సీఐటీయు మండల కార్యదర్శి చల్లకొలుసు మల్లికార్జునరావు డిమాండ్ చేశారు. ఇవాళ తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ప్రభుత్వం ఉచితంగా ఆర్టీసీ బస్సులు కల్పించిందని, ఈ పథకానికి తాము వ్యతిరేకం కాదని తెలిపారు.