ఆసియా కప్‌కు ముందు ఒమన్ ఆటగాడు సుఫ్యాన్ మెహ్మద్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ టోర్నీలో పెద్ద జట్లకు షాక్ ఇస్తామని అతడు తెలిపాడు. ఆసియా కప్‌లో భారత్, పాక్, UAEలతో కూడిన గ్రూప్‌లో ఒమన్ ఉంది. తన తొలి మ్యాచ్‌లో పాక్‌తో తలపడనుంది. టీమిండియాతో సెప్టెంబర్ 19న ఆడనుంది. ఈ గ్రూప్‌లో టాప్-2లో నిలిచిన రెండు జట్లు సూపర్-4కు అర్హత సాధిస్తాయి.