MBNR: జిల్లా కేంద్రంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన పాత పాలమూరు వద్ద లడ్డూను లక్కీ డిప్ ద్వారా సీనియర్ జర్నలిస్ట్ జివి.గౌడ్ దక్కించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ అభయాంజనేయ యువజన సంఘం సభ్యులు ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి, 11 కిలోల లడ్డూ, 11 తులాల వెండి గణనాథుడి విగ్రహాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆ గణనాథుడి ఆశీస్సులు తనపై ఉండడం సంతోషంగా ఉందన్నారు.