మహబూబ్ నగర్ జిల్లా పోలీసులు మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. జిల్లా కేంద్రంలో ఇవాళ ఉదయం నుంచి యూరియా బస్తాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్న నేపథ్యంలో వారు తాగేందుకు నీరు లేక తినేందుకు తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో జిల్లా టూ టౌన్ పోలీసులు మానవతా దృక్పథాన్ని చాటుకుంటూ వాటర్ ప్యాకెట్లను రైతులకు అందజేశారు.