ATP: ఈనెల 11న మళ్లీ తాడిపత్రికి వస్తానని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈనెల 6న తాడిపత్రికి వచ్చారు. అయితే 10న సీఎం చంద్రబాబు జిల్లాకు వస్తుండటంతో పోలీసు బలగాలను తిమ్మంపల్లికి వెళ్లాలని పెద్దారెడ్డిని కోరారు. సీఎం పర్యటన ముగిసిన తర్వాత 11న తాడిపత్రికి వస్తానని పెద్దారెడ్డి పేర్కొన్నారు.