KNR: పచ్చదనాన్ని పది తరాలకు పంచుదామని కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్, విజయ్ కుమార్ అన్నారు. సోమవారం సత్తుపల్లి పట్టణంలోని గాంధీనగర్ రోడ్లో, మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలను నాటారు. ఆయన మాట్లాడుతూ.. భావితరాల మనుగడ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పచ్చదనం పెంపొందించడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు.