NLG: తిప్పర్తి మండలం అల్లిగూడెం గ్రామానికి వెళ్లే రహదారిని కంపచెట్లు కమ్మేశాయి. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముత్యాలమ్మ చెరువు నుంచి గుండ్ల బావి వరకు రోడ్డుకి ఇరువైపులా ముళ్ళ పొదలు పెరిగి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అధికారులు వెంటనే కంపచెట్లను తొలగించి దారి మరమ్మత్తులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.