SKLM: రైతులు ఎరువుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తెలిపారు. సోమవారం శ్రీకాకుళం మండలం తండేం వలసలోని, రైతు సేవా కేంద్రంలో ఎరువులు పంపిణీ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి ఈ మేరకు మాట్లాడారు.