నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాను నిషేధించడంతో దేశంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీనికి నిరసనగా ఆందోళనకారులు పార్లమెంట్ భవనంలోకి దూసుకెళ్లారు. ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా ‘Gen-Z’ పేరుతో యువత ఉద్యమం ప్రారంభించింది. రాజధాని ఖాట్మండ్‌లో భారీ స్థాయిలో నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఈ నిషేధాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.