E.G: జిల్లాలో కంద పంటకు సరైన మార్కెట్ ధర లభించడం లేదనే రైతుల ఆందోళనల దృష్ట్యా, మార్కెటింగ్ వ్యవస్థలో సమతుల్యతను తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు అవసరమని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. సోమవారం రాజమండ్రిలో ఉద్యానవన, మార్కెటింగ్ అధికారులుతో ఆమె సమావేశం నిర్వహించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న ప్రత్యామ్నాయ పంటలను పరిగణనలోకి తీసుకోవాలని వారికి సూచించారు.