ATP: కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం ఛైర్మన్ పి.ఈశ్వర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిని కలిశారు. స్వామి చిత్రపటం అందజేసి సత్కరించారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో శాలివాహన సంక్షేమ సంఘం డైరెక్టర్ కె.వెంకటసుబ్బయ్య, కుమ్మర సంఘం ప్రముఖులు పాల్గొన్నారు.