GNTR: ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎరువులు, యూరియా సకాలంలో అందించాలని సీపీఐ, రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మంగళగిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన నిరసనలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.వీ.వీ. ప్రసాద్ పాల్గొన్నారు. ఎరువుల కొరత వల్ల రైతులు నల్లబజారుకు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.