MBNR: దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా భూత్పూర్ మండలం తాటిపత్రిలో అంగన్వాడీ స్కూల్ భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. అనంతరం పెద్దతండా నుంచి లోక్యతండా వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. అనంతరం వెల్కిచర్లలో పంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తారు.