KRNL: ఈనెల 1న గణేష్ నగర్లో వృద్ధురాలు కాటసాని శిలలీల(75) హత్యకేసును త్రీటౌన్ పోలీసులు ఇవాళ ఛేదించారు. ఇంట్లో పని చేస్తున్న కురువ వరలక్ష్మి (49) రోకలి బండతో తలపై కొట్టి హత్య చేసి, బంగారు ఆభరణాలు, బ్యాంకు పాసుపుస్తకాలు, చెక్ బుక్లు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, డీఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు.