VSP: నగరాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని GVMC కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జీవీఎంసీ 4వ జోన్ జోనల్ కార్యాలయంలో 4వ జోనల్ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు విధుల పట్ల అంకిత భావంతో నిర్లక్ష్యం వహించకుండా విధులు నిర్వహించాలని, నగరాభివృద్ధిపై, జీవీఎంసీ ఆర్థిక పరిపుష్టి పై దృష్టి కేంద్రీకరించాలన్నారు.