RR: షాద్నగర్ పట్టణ పరిధిలోని చేగిరెడ్డి ఘనపూర్ గ్రామంలో నూతనంగా వచ్చిన రేషన్ కార్డులను గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాజీ సర్పంచ్ శివ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన రేషన్ కార్డులు రావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రజా పాలన అని మాటల్లో చెప్పడం కాదు పనుల్లో సైతం చేసి చూపుతుందన్నారు.