ADB: రూరల్ మండలంలోని యాపాల్ గూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ భాషా దినోత్సవం కార్యక్రమాన్ని ఇవాళ సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా కవి కాళోజీ నారాయణరావు పాఠశాల చిత్రపటానికి సిబ్బంది పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలంగాణ యాస, భాష కోసం ఉద్యమించిన గొప్ప కవి కాళోజీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో HM నిర్మల భాయి, రాధా బాయి, వేణు తదితరులు పాల్గొన్నారు.